![]() |
![]() |

కార్తీక దీపం సీరియల్ డిసెంబర్ 31 నాటికి 1549 ఎపిసోడ్ కి చేరుకుంది. కాగా ఈ ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇద్దరిని వెతుక్కుంటూ హేమచంద్ర ఇంటికి వచ్చింది సౌందర్య. అక్కడ వాళ్ళిద్దరి గురించి అడుగుతుంది. అక్కడే ఉన్న దీప, కార్తీక్ లు చాటు నుండి తన కంటపడకుండా సౌందర్యని చూస్తారు. ఆ తర్వాత సౌందర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోయాక దీప, కార్తిక్ ఇద్దరు మాట్లాడుకుంటారు. "దీప.. నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు" అని కార్తీక్ అన్నాడు. "లేదు డాక్టర్ బాబు నేను వెళ్ళను. ఎలాగూ చనిపోతున్నాను. నేను వాళ్ళకింక కనిపించను. మీరు, చారుశీల.. నాకున్న జబ్బు గురించి, ఎక్కువ రోజులు బ్రతకనని మాట్లాడుకోవడం. నేను విన్నాను. మీరు అత్తయ్య దగ్గరికి వెళ్ళండి" అని దీప ఏమోషనల్ అయింది. "సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలియదు గాని.. నేను డాక్టర్ గా నిన్ను ఎలా కాపాడుకోవాలో, అలా కాపాడుకుంటాను. నా నుండి నిన్ను ఎవరు వేరు చేయలేరు" అని డాక్టర్ బాబు అన్నాడు. " మీరు అలా మాట్లాడితే నా గుండె ఆగిపోతుంది. నేను అత్తయ్య గారి దగ్గరకి వెళ్లి ఇదంతా చెప్తాను. మీరు నేను చనిపోయాక, అత్తయ్య దగ్గరికి వెళ్తానని నాకు మాట ఇవ్వండి. అప్పుడేమో నా ప్రేమ గుర్తించక బాధపెట్టారు. ఇప్పడేమో ప్రేమ ఎక్కువ చూపించి బాధపెడుతున్నారు" అని దీప ఏడుస్తుంది. కార్తీక్ మాట్లాడుతూ "ఎప్పుడు చనిపోతానని భాదపడుతున్నావు. కానీ నేను ఆ చావు రాకుండా కాపాడుకుంటానని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు" అని కార్తీక్ బాధపడ్డాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకున్నారు.
ఆనందరావు, తన మనవరాళ్లు అయిన హిమ, శౌర్యలతో భోజనం చేస్తుండగా.. హిమ డల్ గా కన్పించడంతో "ఏంటమ్మా అలా ఉన్నావ్" అని అడిగాడు ఆనందరావు. దానికి హిమ మాట్లాడుతూ "అమ్మ నాన్నలు బ్రతికే ఉన్నారని శౌర్య ఇప్పుడు చెప్తుంది. నేనేమో అమ్మ నాన్నలను చూసానని చెప్తే.. మీరు ఎవరు పట్టించుకోవడం లేదు. వారి గురించి ఆలోచించకుండా మనం అందరం ఇలా భోజనం చెయ్యడం నాకు నచ్చట్లేదు" అని అంది. దానికి సమాధానంగా శౌర్య మాట్లాడుతూ "అదేం లేదు.. మా బాబాయ్ పిన్ని వాళ్ళతో కలిసి భోజనం చేయడం. నీకు ఇష్టం లేదు. అందుకే ఇలా గొడవ చేస్తున్నావు. నీవన్నీ నాటకాలు" అని అంది. ఆనందరావు మాట్లాడుతూ "ఏంటమ్మా.. అలా మాట్లాడుతున్నావ్" అని అడిగాడు. "లేదు తాతయ్య.. బాధతో మాట్లాడాను" అని హిమ అంటుంది.
ఆ తర్వాత చారుశీల ఒంటరిగా కార్తీక్ గురించి ఆలోచిస్తూ "అసలు మోనితకి, కార్తీక్ అంటే ఎందుకు అంత ఇష్టం. పెళ్లి అయి పది సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి కార్తీక్ వెనక ఉన్న ఆస్తి కోసమా అంటే.. కాదు తనకు చాలానే ఉంది. కార్తీక్ అంటే పిచ్చి. కాబట్టే ఇన్ని రోజులు కార్తీక్.. కార్తీక్ అంటూ వెంటబడింది. అసలు కార్తీక్ కి ఆస్తి ఎంత ఉంది. తనని నా సొంతం చేసుకుంటే ఆస్తి అంత నాకే. దీప చనిపోయాక నాకు అడ్డెవరూ ఉండరు. ఈ లోపు దీపకు దగ్గర కావాలి" అని మనసులో అనుకుంటుంది.
దీప పూజ చేసుకుంటూ "దేవుడా.. ఎలాగైనా డాక్టర్ బాబుని, అత్తయ్య గారి దగ్గరికి వెళ్లేలా చెయ్" అంటూ మొక్కుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తర్వాతి ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.
![]() |
![]() |